04-10-2025 10:22:28 PM
జిల్లా కలెక్టర్ కలెక్టర్..
బతుకమ్మ వేడుకల్లో కోలాటలాడిన కలెక్టర్, ఎస్పీ..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): పువ్వులను పూజించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రజలదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) అన్నారు. తాంసి మండలం కప్పర్ల గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామానికి వచ్చినా కలెక్టర్, ఎస్పీ గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ముందుగా కాంగ్రెస్ నాయకురాలు గండ్ర సుజాత, మహిళలతో కలిసి బతుకమ్మలకు కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఓ చోట చేర్చి ఆడి పాడారు. గ్రామస్థులంతా ఐక్యమత్యంగా ఉండి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.