30 June, 2026 | 1:41 AM

అల్ఫోర్స్ విద్యార్థినికి నటరాజ నందీశ్వర అవార్డు

30-06-2026 12:00 AM

కొత్తపల్లి, జూన్ 29 (విజయక్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థినికి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ నటరాజ నందీశ్వర అవార్డు లభించింది.  ఇటీవల హైదరాబాద్కు చెందిన ప్రముఖ సాంస్కృతిక సంస్థ నృత్యమాల నాట్య కళ వెల్ఫేర్ సొసైటీ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాలకు చెందిన జె.అదిత్రి రావు

అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి నందీశ్వర అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా విద్యార్థినిని  అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.