30 June, 2026 | 2:11 AM

దేశవ్యాప్తంగా గోవధ నిషేధం అమలు చేయాలి: హెచ్‌జీఆర్‌ఎస్

30-06-2026 12:00 AM
  1. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి
  2. హిందూ ముస్లిం మత ప్రముఖుల ఏకగ్రీవ మద్దతు

పంజాగుట్ట, జూన్ 29 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా గోవధపై చట్టబద్ధమైన సంపూర్ణ నిషేధం విధించి, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందుస్థాని గౌరక్షా సమితి (హెచ్జీఆర్‌ఎస్) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గోరక్షణ అంశంపై మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం ప్ర ముఖులు కలిసి పనిచేయడం దేశ సామరస్యానికి శుభపరిణామమని సమితి నాయకు లు పేర్కొన్నారు.

సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం నిర్వహించిన హెచ్జీఆర్‌ఎస్ తొ లి విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షు డు విజయవిహారం రమణమూర్తి మాట్లాడుతూ గోరక్షణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా గోవధ నిషేధానికి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోవధను కేవలం ఒక మతంతో ముడిపెట్టి ప్రచారం చేయడం సరైంది కాదని, ఈ అం శంపై సమాజంలో అనేక అపోహలు నెలకొన్నాయని అన్నారు.

హిందూ, ముస్లిం ప్రము ఖుల సమన్వయంతో ఏర్పడిన హిందుస్థాని గౌరక్షా సమితి సామరస్యానికి వేదికగా నిలుస్తుందని తెలిపారు.సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు జనాబ్ మీర్ ఇనాయత్ అలీ బా ఖ్రీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీఫ్ ఎగుమతి సంస్థలను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆవు లు, ఎద్దులు, దూడలు సహా పశుసంతతికి సంపూర్ణ రక్షణ కల్పించేలా చట్టాలను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సమితి ప్రధాన కార్యదర్శి జనాబ్ మౌలానా హకీం సూఫీ సయ్యద్ షా మాట్లాడుతూ మరణించిన గోవుల అంత్యక్రియల కోసం ప్రతి గ్రామం, పట్టణంలో ప్రత్యేక స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.సమితి గౌరవ సలహాదారు, నిజాం నవాబు వారసుడు రౌనక్ యార్ ఖాన్ మాట్లాడుతూ మతాల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు, గోరక్షణ అంశంపై అపోహలను తొలగించేందుకు హెచ్జీఆర్‌ఎస్ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

సమితి ఉపాధ్యక్షుడు మౌలానా డా. సయ్యద్ ఆసిఫ్ ఉమ్రీ మాట్లాడుతూ గోవుల సంరక్షణ రైతులకు ఆర్థిక భారంగా మారుతోందని, వాటి పోషణ కోసం ప్రత్యేకంగా ‘కౌ కార్డు‘ వంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని సూచిం చారు. గౌరవ సలహాదారు, సిక్కు ప్రతినిధి మన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు మత రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని అ న్నారు.

మరో ఉపాధ్యక్షుడు విజయశంకర స్వామి మాట్లాడుతూ గోరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసకు పా ల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.క్రైస్తవ ప్రతినిధి డేవిడ్ పాల్ మాట్లాడుతూ ప్రభుత్వం గోరక్షణకు సమర్థవంతమైన చర్యలు చేపడితే గోవధ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో సమి తి ఉపాధ్యక్షులు మౌలానా డా.సయ్యద్ ఆసిఫ్ ఉమ్రీ, విజయశంకర స్వామి, బాలకృష్ణమయానంద స్వామి, జీవన్ జోయెల్, యాస్మీన్ బేగం, కార్యదర్శులు మహమ్మద్ ఇక్బాల్ చౌదరి, మల్లికావల్లభ, దున్న లక్ష్మేశ్వర్, సాయి శ్రీనివాస్, మౌలానా రియాజు ద్దీన్ నక్షబంది, సయ్యద్ సికందర్ మషూగి, పి. ఉదయ్ కుమార్, ఎన్. రాజశ్రీ, ఖదీజ్ఞాసి రజనీ, కుమార్‌స్వామి, సభ్యులు స్వామి అమృతానందగిరి, దరూరి నరసింహాచార్యులు, దరూరి శేషాచార్యులు, యడ్లపల్లి మోహనరావు, సోమేశ్వర స్వామి, సత్యనారాయణస్వామి, మొఘల్‌సాయి అక్బర్ బాదు షా, మౌలానా సయ్యద్ తాఖీ రజా, జాన్ కొంకి, మోచర్ల, అన్వర్ పటేల్, వంశీ, గణేష్ గల్లా, సైదయ్య పలువురు హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ ప్రముఖులు పాల్గొన్నారు.