30 May, 2026 | 2:29 AM

అరిస్టాటిల్ కాలేజీకి జాతీయ అవార్డు

30-05-2026 01:38 AM

బెంగుళూరులో ప్రదానం

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని అరిస్టాటిల్ పీజీ కళాశాల (స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్) జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌లో బిగిన్‌అప్ వెంచర్స్ ఇండియా నిర్వహించిన ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అవార్డ్స్ కార్యక్రమంలో కళాశాలకు ట్రస్టెడ్ అండ్ ఫ్యూచరిస్టిక్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ కాలేజ్ ఆఫ్ ది ఇయర్ 2026 అవార్డును ప్రదానం చేశారు.

విద్యా ప్రమాణాలు, అకడమిక్ ప్రతిభ, సమర్థవంతమైన పరిపాలన, ఉత్తమ ప్లేస్మెంట్లు, ఆధు నిక మౌలిక సదుపాయాల కల్పనలో అరిస్టాటిల్ పీజీ కళాశాల సాధించిన విశేష పురో గతిని గుర్తించి ఈ అవార్డును ప్రకటించారు. దేశవ్యాప్తంగా 450కు పైగా విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొ న్న ఈ జాతీయ స్థాయి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎల్. శ్రీనివాస్ రెడ్డి సంస్థ తరఫున అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు భాగస్వాము లందరికీ అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అ ధ్యాపకులు, విద్యార్థులు ప్రొఫెసర్ ఎల్. శ్రీనివాస్ రెడ్డిని అభినందిస్తూ, ఈ అవార్డు అరి స్టాటిల్ పీజీ కళాశాల విద్యా ప్రతిష్టకు, నాణ్యతకు, విశిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు.