3 June, 2026 | 12:04 AM

Breaking News

అక్రమ రవాణాగా ఇసుక.. అధికారుల కన్నులకు మసక!   •   రాష్ట్రంలో తుమ్మిడిహెట్టి హీట్!   •   ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి   •   రైతులను మోసం చేసిన ఇద్దరు వ్యక్తులు రిమాండ్   •   ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి గంగాధర్!!   •   సాయి సామల చెస్ అకాడమీ సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు   •   శివంపేట మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!!   •   ఎందరో మహానుభావుల బలిదానాల త్యాగ ఫలం   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్   •   పండుగలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •  

ట్రాక్టర్‌తో గుద్ది హత్య చేశారని ఆందోళన

08-04-2026 12:00 AM

కుటుంబ సభ్యుల రాస్తారోకో 

లక్ష్మణ చందా, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): మామాడ మండలంలోని దిమ్మదుర్తి గ్రా మానికి చెందిన దుండగుల సాయిరాం రోడ్డుపై మృతి చెందడంతో కుటుంబ సభ్యు లు ఆందోళన చేశారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో సాయిరాం ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.

అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదని సాయి రాంను ట్రాక్టర్‌తో గుద్ది హత్య చేశారని కుటుంబ సభ్యులు మంగళవారం ఆందోళన చేశారు. ఖానాపూర్ నిర్మల్ జాతీయ రహదారిపై దిమ్మదుర్తి వద్ద గంట సేపు బైఠాయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఐ కృష్ణ ఎస్త్స్ర హనుమాన్లు అక్కడికి చేరుకుని ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.