బీఆర్ఎస్ సమన్వయకర్తల నియామకం
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో వరంగల్, నల్లగొండ జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామా రావు ఆదివారం నియమించారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు మాజీ మంత్రి రాజయ్య, రవిశంకర్, జనగామకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తోట ఆగమయ్య, పాలకుర్తికి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, భూపాలపల్లికి గండ్ర వెంకటరమణరెడ్డి, పుట్టమధు, డోర్నకల్‌లో రెడ్యానాయక్, అనిల్ జాదవ్, మహబూబాబాద్‌కు బానో తు శంకర్‌నాయక్, జాన్సన్ నాయక్, ములుగులో బాడే నాగజ్యోతి, కోవ లక్ష్మి, పర కాలలో చల్లా ధర్మారెడ్డి, కోరుకంటి చందర్, వరంగల్ వెస్ట్‌కు దాస్యం వినయ్‌భాస్కర్ , వినోద్‌రావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కే సంజయ్. సంజయ్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, నర్సంపేట పెద్ది సుదర్శన్‌రెడ్డి, దండె విఠల్, వర్ధన్నపేటలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, రసమయి బాలకిషన్, వరంగల్ ఈస్ట్ నన్నపనేని నరేందర్, గంగుల కమలాకర్, సతీశ్‌కుమార్, రవీందర్‌సింగ్, జీవి రామకృష్ణ, సునీల్ రావుకు బాధ్యతలు అప్పగించారు.
నల్లగొండ జిల్లాలో..
దేవరకొండ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కార్మిక విభాగం నేత రాంబాబుయాదవ్, మిర్యాలగూడకు నల్లమోతు భాస్కర్‌రావు, రాజీవ్ సాగర్, మునుగోడులో కూసుకంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాకేశ్‌కుమార్, నాగార్జునసాగర్‌లో నోము ల భగత్, ఎమ్మెల్యే విజయుడు, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, గువ్వల బాలరాజు, నల్లగొండలో కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, హుజూర్‌నగర్ జగదీశ్‌రెడ్డి, ఇంతియాజ్, కోదాడలో బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి, నవీన్‌కుమార్, తుంగతుర్తి గాదరికిషోర్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఆలేరు గొంగిడి సునీత, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎండీ ఇబ్రహీంకు బాధ్యతలు అప్పగించారు.






