11-11-2025 11:06:07 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దేశిని చిన్న మల్లయ్య అని, ఆయన పోరాట స్ఫూర్తితో బలహీన వర్గాలు చైతన్యం కావాలని బీసీ పొలిటికల్ ప్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, యెలికట్టే విజయ కుమార్ గౌడ్, ఎస్. దుర్గయ్య గౌడ్ లు అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ప్రంట్ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్న మల్లయ్య వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ గీత రచయిత అందెశ్రీ అకస్మిక మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గీతా వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిషలు కృషి చేశారని అన్నారు. అదే విదంగా తెలంగాణ గేయ రచయిత ఎన్నో రచనలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితి లోకానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు అంబాల నారాయణ గౌడ్, సింగం నగేష్, గడ్డం మీది విజయ కుమార్ గౌడ్, ఐలన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.