calender_icon.png 24 February, 2026 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం

24-02-2026 01:35:33 AM

  1. అప్పుడే దేశంలో రుగ్మతలకు పరిష్కారం 
  2. డిప్యూటీ సీఎం భట్టి

వికారాబాద్, ఫిబ్రవరి -23: రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలోని రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని, ఆయనను ప్రధానమంత్రిగా చేసే వరకు రెండు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నా రు. రెండురాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ స్థా నాలు గెలుచుకునేలా కృషి చేయాలని సూచించారు. దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో సోమవారం భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘కుల సమస్యలు, రిజర్వేషన్లు, కాంగ్రెస్ వాదిగా కుల వివక్ష నిర్మూ లనకు ఎలా పోరాటం చేయాలి’ అన్న అం శంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. దేశంలో అంటరానితనం, వివక్ష ఎక్కడ ఎదురైనా రాహుల్ గాంధీ అక్కడ ప్రత్యక్షం అవుతారు అని తెలిపారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల కుల వివక్షను భరించలేక బలవన్మరణానికి పాల్పడితే రాహుల్ గాంధీ నేరుగా యూనివర్సిటీకి చేరుకొని విద్యార్థులతో చర్చించి పోరాట విధానాన్ని ఖరారు చేశారని తెలిపారు. ఆయన ఆలోచన మేరకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రోహిత్ వేము ల చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ప్రకటించినట్టుగా అధికారంలోకి రాగానే ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశ స్వాతంత్రం అనం తరం ఎక్కడా జరగని కుల గణనను ప్రజా ప్రభుత్వం 50 రోజుల్లో పూర్తి చేసి శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం పొం దాలని వివరించారు. 

బీజేపీ కుట్ర..

దేశానికి స్వాతంత్రం సాధించడంతోపాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ సమాన త్వం సాధించేందుకు అనేక విప్లవాత్మక చట్టా లు చేసిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని భట్టి విక్రమార్క ఆరోపించారు. స్వాతంత్య్రానికి ముందు నుంచి దేశంలోని రుగ్మతల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేసేందుకు బీజేపీ యత్నిస్తున్నదన్నారు.

ఈ సమాజం సామాజికంగా, ఆర్థికంగా విభజన జరిగి ఇలాగే ఉండాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయ ని తెలిపారు. కులం అనేది భారతదేశంలో ఒక వాస్తవం, తాను కుల వివక్షణ ఎదుర్కొన్నానని వివరించారు. ఈ సమాజంలో కుల వివక్ష ఉంటుంది అన్న వాస్తవాన్ని మదిలో పెట్టుకుని బలమైన సంకల్పంతో అనుకున్న లక్ష్య సాధనకు ముందుకు పోతున్న క్రమం లో వివక్ష ఎదురైనా అది మన లక్ష్యాలను దెబ్బతీయలేదని వివరించారు.

కాంగ్రెస్ కమిటీ రాజకీయ పార్టీగా మాత్రమే కాకుం డా దేశంలో అంటరానితనం, బాల్య వివా హం, వితంతు వివాహాలు వంటి అనేక రు గ్మతలపై దశాబ్దాలుగా ప్రజలను చైతన్యం చే స్తూ ముందుకు పోతుందని తెలిపారు. గాం ధీ ఆధ్వర్యంలో హరిజనోద్ధరణ పేరిట పెద్ద యాత్ర చేపట్టారని దళితుల దేవాలయల ప్రవేశం, దళిత వాడల్లో పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలు ఈ దేశంలో అంటరానితనా న్ని తొలగిస్తారని గాంధీ ఓ నమ్మకాన్ని ఏర్పరిచారని తెలిపారు. 

స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని నెహ్రూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో దేశంలో అంటరానితనం నిర్మూల నకు 1049లో ఆర్టికల్ 17 ద్వారా అవకాశం కల్పించారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను పూర్తిగా అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారానే సాధ్యమైంది అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం తీసు కొచ్చిన భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ ద్వారా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వాతంత్రం లభించిందని తద్వారా సామాజిక వివక్షను ఎదుర్కొనేందుకు చేయూత లభించిందని డిప్యూటీ సీఎం వివరించారు. సమావేశం లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డాక్టర్ వంశీ చందర్ రెడ్డి, ఏఐసిసి నాయకులు విశ్వనాథన్, సావంత్, సచిన్ రావు తదితరులు పాల్గొన్నారు.