calender_icon.png 20 August, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరి ఉప్పొంగడంతో తెలంగాణ, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల మధ్య జాతీయ రహదారి మూసివేత

20-08-2025 01:17:44 AM

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్

ములుగు, ఆగస్టు19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలోని గోదావరి నది పరివాహక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్.పి హెచ్చరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో ములుగు జిల్లా ఎగువ భాగం నుండి గోదావరి నదికి వరద ఉధృతి పెరిగినందున తెలంగాణ మరియు చత్తీస్ ఘడ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి 163 పై పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం శివారులో గల రేగుమాగు వాగు పొంగి టేకులగూడెం వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తున్నందున, వరద ఉధృతి తగ్గేవరకు ఇట్టి వంతనపై ప్రయాణాలను నిషేధిస్తున్నామని,

వంతెన ముఖ ద్వారం వద్ద బారికేడ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. కావునా సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే పోలీసు వారి సహాయం తీసుకోవాలని సూచించారు. ఇరు రాష్ట్రాల  ప్రజలు ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా ప్రయాణం చేయాలని సూచించారు