20-08-2025 01:18:51 AM
జనగామ,(విజయక్రాంతి): హైదరాబాద్ రామంతాపూర్లో విద్యుత్ వైర్ తెగి ఐదుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీంతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం జనగామ జిల్లాకేంద్రంలో కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్న తీగలను తొలగించారు. జనగామ విద్యుత్ ఎస్ఈ టి.వేణు మాధవ్ ఆదేశాలతో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జనగామ టౌన్ 1 పరిధిలో కిందికి వేలాడుతున్న కేబుల్ టీవీ వైర్లు, ఇంటర్నెట్ తీగలను తొలగించారు.