దేశ భద్రతే ధ్యేయం
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో పనిచేస్తా
బాధ్యతలు స్వీకరించిన వేళ బండి సంజయ్ వ్యాఖ్యలు
హైదరాబాద్, జూన్ 13 (విజయ క్రాంతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా మార్గదర్శ కత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా తన బాధ్యతలను నిర్వహిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశ భద్రతే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడిం చారు. గురువారం ఢిల్లీలోని హోం శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి ఆశీస్సులు పొందారు. సహచర మంత్రి నిత్యానందరాయ్ బండి సంజయ్‌కు అభినందనలు తెలిపారు. అలాగే మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, కిషన్ రెడ్డి.. తదితరులు బండి సంజయ్‌కు అభినందనలు తెలిపారు.






