22-07-2024 01:34:01 AM
మాజీ ఎంపీ వినోద్‌కుమార్
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కార్మాగారం, ప్రతి జిల్లాలకు నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కోరారు. ఈ బడ్జెట్ వచ్చే ఐదేళ్ల మోదీ పరిపాలనకు పునాది వేస్తుందని, మోదీ మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
విజభన చట్టంలో పొందుపరిచిన అంశాలపై పదేళ్లకాలంలో దృష్టి పెట్టడంలో కేంద్రం విఫలమైందని ధ్వజమెత్తారు. ఈసారి టీడీపీపై ఆధారపడి ప్రభుత్వం నడపాల్సి వస్తుందని, ఏపీలోని కోస్తాతీరంలో రూ.60 వేల కోట్లతో పెట్రో కెమికల్ ప్రాజెక్టుకు క్లియరెన్స్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కొంత మేరకు నిధుల కేటాయింపులు చేసుకుంటున్నట్టు తెలుస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ 8, కాంగ్రెస్ 8, ఎంఐఎం 1 పార్లమెంటు సీట్లు గెలుచుకున్నాయని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ ఎంపీ లుగా తాము ఉన్నప్పుడు చాలా అంశాలను పార్లమెంటులో లేవనెత్తి రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకున్నామని తెలిపా రు.
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు గత 15 రోజు ల నుంచి కేంద్రానికి ఎలాంటి వినతిపత్రా లు ఇవ్వలేదని విమర్శించారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు మాత్రమే సమయం ఉందని, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా, రైల్వేకోచ్, ఉక్కు ఫ్యాక్టరీలు ఏర్పా టు చేసేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు. కాంగ్రెస్‌కు చెందిన 8 మంది ఎంపీ లు కూడా తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంతో పోరాటం చేయాలని పేర్కొన్నారు.