22-07-2024 12:51:15 AM
పాపన్నపేట, జూలై 21 : ఆషాఢ మాసం మూడో ఆదివారాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గా భవాని మాతను ఫలాంబరి దేవీగా అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రత్యేకాలంకరణతో పాటు విశేష పూజలు, అభిషేకం నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో మెదక్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దర్శనానికి పోటెత్తడంతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో దర్శనానికి సమయం పట్టింది.