25-01-2026 04:13:52 PM
బిబిపెట్,(విజయక్రాంతి): బిబిపెట్ మండలం జనగామ గ్రామంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, ఉపసర్పంచ్ పాత స్వామి, నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఓటు హక్కు మన రాజ్యాంగం ఇచ్చిన గొప్ప ఆయుధం అని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి పౌరుడు విధిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజబాబు, నరసింహాచారి, వంశీ, ఎమ్మార్వో జిపిఓ రవి, ఆకుల రాములు తదితరులు పాల్గొన్నారు.