25-01-2026 04:11:07 PM
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సంతోష్ రెడ్డి
మోతె, (విజయక్రాంతి): గత బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్కులకు దోసి పెట్టి అమాయకుల ప్రణాలతో చెలగాటం ఆడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, దిష్టి బొమ్మను దగ్ధం చేసిన అనంతరం, ఆయన మాట్లాడుతూ, కర్ల రాజేష్ మృతికి కారణమైన స్కామ్ తో సంబంధం కలిగిన బిఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పు దొవ పట్టించి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రతిష్ట కు భంగం కలిగించి దొంగే దొంగ అన్న చందం గా ఉన్నదని ఏద్దేవా చేశారు.
ప్రభుత్వం పేదలకు ఇచ్చే ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్మును, అర్హులైన పేదలకు అందకుండా కొంత మంది అదే పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మీరు మాకు నీతులు చెప్పడం మానుకోవాలని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల ముందు దళితులు గుర్తుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సి యం ఆర్ యఫ్ స్కామ్ అసలు సూత్ర దారులను దాసి పెట్టి అమాయకులను బలి చేయడం సరైంది కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మాజీ జడ్పి టిసి పి. పుల్లా రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు యం. గురువారెడ్డి, మండల వర్కింగ్ ప్రసిడెంట్ పులి ఈదయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న, సర్పంచ్ లు కోల లింగయ్య, మండల యస్సి సెల్ అధ్యక్షులు కొరిపల్లి విక్రమ్, సోషల్ మీడియా మండల అధ్యక్షులు అర్వపల్లి గణేష్,దోసపాటి చిరంజీవి, బొడ్డు నర్సయ్య, ఉపేందర్, లింగయ్య, ఉపేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.