calender_icon.png 25 January, 2026 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ సమావేశంలో పగడాల సరితకు సన్మానం

25-01-2026 04:25:59 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో, ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో అశ్వాపురం మండలం, రామచంద్రపురం గ్రామపంచాయతీ రెండవ వార్డు బీజేపీ అభ్యర్థినిగా గెలుపొందిన పగడాల సరితను బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముస్కు శ్రీనివాసరెడ్డి, పోడియం బాలరాజు, పున్నం బిక్షపతి, ముక్కెర కోటేశ్వరి, పగడాల కృష్ణారెడ్డి, సోమ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.