25-01-2026 04:07:58 PM
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్,(విజయ క్రాంతి) : ప్రజాస్వామ్య ములో ఓటు హక్కు వజ్రాయుధమని , 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం నుండి బాలుర జూనియర్ పాఠశాల మరియు కళాశాల మైదానం వరకు 16 వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురష్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు పాల్గొన్నారు జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా జిల్లా అధికారులు, ఓటర్ల అందరిచే ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు
అనంతరం 16 వ జాతీయ ఓటరు దినోత్సవము సందర్బంగా కళాశాల మైదానం గ్రౌండ్లో. నందు ఏర్పాటు చేసిన సమావేశములో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని అందరు ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని, ప్రతి ఒక్కరు ఓటు హక్కుపై అవగాహనా కలిపించికోవాలని సూచించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు పూర్తి అయిన ఎనిమిది మందికి ఓటు హక్కు కలిపిస్తూ బ్యాడ్జీలు పంపిణి చేశారు. ప్రజాస్వామ్యములో 85 సంవత్సరాల నుండి ఓటు హక్కు వినియోగించుకున్న 03 మంది సీనియర్ సిటిజన్స్ కు ఈ సందర్బంగా శాలువాలతో సన్మానం చేశారు.
ఓటరు అవగాహనా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొని అత్యుత్తమ ప్రతిమ కనబరిచిన వారికి సర్టిఫికేట్ లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, వ్యవసాయ అధికారి దేవకుమార్ , మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ,ఇంటర్మీడియట్ అధికారి మాధవి , ,తాసిల్దార్ లక్ష్మణ్ బాబు , ఎన్నికల తాసిల్దార్ గఫార్, డీఎస్పీ ప్రసన్నకుమార్,, జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్ర రాజు,,అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.