25-01-2026 04:41:08 PM
న్యూఢిల్లీ: వ్యవస్థీకృత సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెల్ విజయంలో సాధించిది. అధునాతన బహుళ-అంచెల సైబర్ మోసాల సిండికేట్‌లో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్న జాతీయ స్థాయి షూటర్, పతక విజేత అయిన క్రీడాకారిణిని సైబర్ సెల్ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని నార్త్-వెస్ట్ సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‌లో 25.06.2025న సెక్షన్లు 318(4)/319(2)/61(2)/3(5) బీఓన్ఎస్ కింద నమోదు చేశారు. ఈ-ఎఫ్ఐఆర్ నెం. 60000101/2025 (05/25) కేసులో ఈ అరెస్టు జరిగింది.
ఈ కేసులో బాధితుడిని మొత్తం రూ.40,27,098 మోసం చేశారని, అరెస్టు చేయబడిన నిందితుడిది ఉత్తరప్రదేశ్, ఆగ్రా నివాసి అయిన హిమాన్షు చౌహాన్ అలియాస్ షూటర్‌గా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లలో రజత, కాంస్య పతకాలు, రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లలో 50 మీటర్ల, 300 మీటర్ల రైఫిల్ ఈవెంట్లలో 22 రైఫిల్‌ను ఉపయోగించి బంగారు పతకాలు గెలుచుకొని జాతీయ స్థాయి షూటర్ గుర్తింపు పొందాడు. నిందితుడు తన పలుకుబడిని, పరిచయాలను దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున సైబర్ మోసానికి పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.