25-01-2026 04:15:42 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): ఓటు హక్కును నిజాయితీగా, నిర్భయంగా వినియోగించుకోవాలని మాజీ జడ్పీటీసీ సభ్యులు తీగల తిరుమల్ గౌడ్ అన్నారు. ఆదివారం దోమకొండలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్ సుధాకర్ ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి-యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరి ఓటు కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.