23 May, 2026 | 12:54 AM

వినియోగదారులకు మరింత చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్

23-05-2026 12:00 AM

కొత్తపల్లి, మే 22(విజయ క్రాంతి): వినియోగదారులకు మరింత చేరువై, సాంకేతిక పరంగా మరిన్ని సేవలను జోడిస్తూ టిజిఎన్పీడీడీసీఎల్ యాప్ను రూపొందించడం జరిగిందని, వినియోగదారుల సౌకర్యార్థం 28 ఫీచర్లతో ఈ యాప్ అందుబాటులో ఉందని కరీంనగర్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ రవీందర్ ప్రకటనలో పేర్కొన్నారు. యాప్ గురించి వివరిస్తూ కన్స్యూమర్ గ్రీవెన్సెస్, న్యూ కంప్లైంట్ :వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను నేరుగా యాప్లో నమోదు చేసుకోవచ్చునని , కంప్లైంట్ స్టేటస్ ,పే బిల్స్,బిల్ హిస్టరీ,వినియోగదారుల బిల్లు సమాచారం,ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ,రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్,కొత్త కనెక్షన్ ఎలా తీసుకోవాలి, పేరు / లోడ్ మార్పు,హెచ్టి కన్స్యూమర్ పోర్టల్,ఆన్లైన్ ఎస్టిమేట్ / డిమాండ్ నోటీసు చార్జీల చెల్లింపు,చాలెంజింగ్ మీటర్,

వినియోగదారుల పరిధిలోని అధికారి వివరాలు సంబంధిత అధికారుల వివరాలు ఫోన్ నంబర్లు,లింక్ ఆధార్ & మొబైల్ ఆధార్ మరియు మొబైల్ నంబర్ లింక్ చేసుకోవడండొమెస్టిక్ బిల్ క్యాలిక్యులేటర్‌పవర్ కసుంప్షన్ గైడ్లైన్స్,సేఫ్టీ టిప్స్,ఫీడ్బ్యాక్, కాంటాక్ట్ అజ్ 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు 1912 నంబర్లను సంప్రదిం చవచ్చు.వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లలో టిజిఎన్పీడీసీఎల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని పై సేవలను వినియోగించుకోవాలని, నాణ్యమైన సేవలు పొందుతూ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూపరింటెండింగ్ ఇంజనీర్ కోరారు.