28 July, 2026 | 2:02 PM

Breaking News

ఎరువుల కొరతపై బీఆర్‌ఎస్ ఆందోళన ,హెచ్చరిక   •   రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •  

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ కాన్పులయ్యేలా ప్రోత్సహించాలి

26-05-2026 01:53 AM

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మే 25: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ కాన్పులయ్యేలా ఆరోగ్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు గర్భిణీలను ప్రోత్సహించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి అన్నారు. సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలోని పీహెచ్ సీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మొబైలైజేషన్ ఎయిడ్ సురక్ష కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీలో అందుతున్న సేవలను గుర్తించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో క్షయ,కుష్టి వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను తెలుసుకొని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి, ల్యాబ్, ఫార్మసీని తనిఖీ చేశారు.

అదేవిధంగా సోమవారం ఆసుపత్రిలో రెండు సహజ కాన్పులు జరగగా సిబ్బందిని అభినందించారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆరోగ్య సిబ్బంది గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి, అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసిద్ధ, సుధాకర్, మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్, సీహెచ్‌ఓ బిచ్చునాయక్, కామేశ్వరరావు, సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్స్ సునీత, మాధవి, కళమ్మ, టీబీ నోడల్ పర్సన్ వీరయ్య,మహేష్ తదితరులు పాల్గొన్నారు.