కేంద్రమంత్రిగా రామ్మెహన్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: కేంద్రమంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ బాధ్యత తనకు అప్పగించిన ప్రధాని మోడీకి రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. సాంకేతికత వినియోగంగతో పౌరవిమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ (టిడిపి) ఎంపి రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 36 ఏళ్ల నాయుడు ఎన్‌డిఎ 3.0 క్యాబినెట్‌లో అతి పిన్న వయస్కుడైన మంత్రి. రామ్మోహన్ నాయుడు మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. పౌర విమానయాన శాఖ బాధ్యతలను గత ఎన్డీయే ప్రభుత్వంలో జ్యోతిరాదిత్య సింధియా చేపట్టిన విషయం తెలిసిందే.






