6 July, 2026 | 3:37 PM

Breaking News

టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •  

జవాన్ల వాహనాన్ని పేల్చిన మావోయిస్టులు

06-01-2025 04:19 PM

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం నక్సల్స్ వాహనాన్ని పేల్చివేసిన ఘటనలో జిల్లా రిజర్వ్ గార్డ్స్ (District Reserve Guard)కి చెందిన ఎనిమిది మంది జవాన్లు, ఓ సివిల్ డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జవాన్ల వెళ్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీతోతో పేల్చారు. యాంటీ నక్సలైట్ ఆపరేషన్ అనంతరం భద్రతా సిబ్బంది తమ స్కార్పియో వాహనంలో తిరిగి వస్తుండగా కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేలి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగిందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (inspector general of police) సుందర్‌రాజ్ తెలిపారు. గత రెండేళ్లలో భద్రతా సిబ్బందిపై నక్సలైట్లు జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని ఓ అధికారి తెలిపారు. ఏప్రిల్ 26, 2023 న, పొరుగున ఉన్న దంతెవాడ జిల్లాలో భద్రతా సిబ్బందిని తీసుకువెళుతున్న కాన్వాయ్‌లో భాగమైన నక్సల్స్ వారి వాహనాన్ని పేల్చివేయడంతో పది మంది పోలీసు సిబ్బంది, ఒక పౌర డ్రైవర్ మరణించిన విషయం తెలిసిందే. పేలుడు ఘటనను సస్తర్ ఐజీ ధ్రృవీకరించారు.