ఈఆర్‌సీ సభ్యులుగా రఘు, శ్రీనివాసరావు
-ప్రమాణం చేయించిన ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కౌన్సిల్ సభ్యులుగా కంచర్ల రఘు, చెరుకూరి శ్రీనివాసరావు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈఆర్‌సీ సభ్యులుగా ఇద్దరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఈనేపథ్యంలో ఈఆర్‌సీ కార్యాలయంలో చైర్మన్ జస్టిస్ డీ నాగార్జున వారితో ప్రమాణం చేయించారు. కంచర్ల రఘు విద్యుత్ శాఖలో వివిధ క్యాడర్లలో సుదీర్ఘంగా పనిచేశారు. అలాగే రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్‌ఏఎస్) అధికారి చెరుకూరి శ్రీనివాసరావు గత 15 ఏండ్లుగా విద్యుత్ రంగంలో వివిధ విభాగాల్లో పనిచేశారు.
ప్రమాణస్వీకారానికి ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్, సింగరేణి సీఎం డీలు, గతంలో ఈఆర్‌సీ చైర్మన్, సభ్యులుగా పనిచేసినవారు, సెస్ చైర్మన్, ఇంధ న శాఖకు చెందిన సీనియర్ ఉన్నతాధికా రులు హాజరయ్యారు. అలాగే విద్యుత్ అకౌంట్స్ అధికారుల సంఘం ప్రతినిధులు అంజయ్య, అశోక్, నాసర్ షరీఫ్, కొరడాల వెంకటేశ్వర్లు, అని, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.






