09-01-2025 01:24:56 AM
సిద్దిపేట, జనవరి 8 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలోని ప్రభు త్వ ఆస్పత్రులను ఎన్‌సీడీ బృందం స భ్యులు బుధవారం సందర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రితో పాటు పట్టణంలోని కాళ్లకుంట కాలని, నాసర్‌పుర బస్తి దవాఖానాలను, ములుగు, మార్కుక్, కుకునూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఎర్రవల్లి, మా మిడియాల, నెమటూర్ గ్రామాల్లోని ఆయుష్మన్ మందిరాలను సందర్శించారు.
ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. హైద రాబాద్‌లో జరుగుతు న్న ఎన్‌సీడీ జాతీయ సదస్సుకు హాజరైన వివిధ రాష్ట్రల అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సిద్దిపేట జిల్లాలో పర్యటించారు.
కలెక్టర్ మను చౌదరి, జిల్లా వైద్యాధికారి పల్వాన్ కుమార్, ప్రభుత్వ ఆస్పత్రి సుపరిండెంట్ శాంతి బృందం సభ్యులకు వైద్య సేవల గురించి వివరించారు. రాష్ట్ర కుటుం బ ఆరోగ్య శాఖ కార్యదర్శి కర్నన్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి సేన్‌శర్మ, చతీస్‌గఢ్ నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ ఆరాధన పట్నానాయక్, వివిధ రాష్ట్రాల ఎన్‌సీడీ అధి కారులు బృందంలో ఉన్నారు.