calender_icon.png 16 October, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2వ ఇంటర్‌స్కూల్ రోబోటిక్స్ పోటీలు

16-10-2025 02:27:33 AM

13 పాఠశాలల నుంచి 20 రోబోటిక్స్ ప్రాజెక్టుల ప్రదర్శన

ముషీరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : టీఏయూఎస్ ఫౌండేషన్ 2వ ఇంటర్‌స్కూల్ రోబోటిక్స్ పోటీ, ఎక్స్‌పోను నిర్వహించినట్లు టీఏయూఎస్ వ్యవస్థాపకుడు సఫీ ఉర్ రెహమాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీఏయూఎస్ ఉచిత రోబోటిక్స్ విద్యను అందిస్తున్న 13 పాఠశాలల విద్యార్థులు తయారు చేసి 20 రోబో టిక్స్ ప్రాజెక్టులు ప్రదర్శించినట్లు చెప్పారు.

ముఖ్య అతిథిగా సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి జాఫర్ జావీద్ హాజరైనట్లు తెలిపారు. హైదరాబాద్ మలక్‌పేట్‌లోని డాన్ హై స్కూల్, కరీంనగర్ జిల్లాలోని హుడా హై స్కూల్ వివిధ విభాగాలలో మొదటి స్థానాన్ని పొందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇఫ్తేఖర్ మెస్కో, వాసి ఉర్ రెహమాన్, డాన్ హై స్కూల్, ప్రిన్సిపాల్ సుల్తాన్ ఉల్ ఉలూమ్ తదితరులు పాల్గొన్నారు.