09-12-2025 10:06:15 AM
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం(NDA Parliamentary Party meeting) ప్రారంభమైంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ లోపలా, బయటా విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడంపై ఎంపీలకు మోదీ కీలక సూచనలు చేయనున్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, గజేంద్ర సింగ్ షెకావత్, జితేంద్ర సింగ్, ఈఏఎం ఎస్. జైశంకర్, అశ్విని వైష్ణవ్, జేడీయూ ఎంపీ సంజయ్ ఝా, ఎన్‌సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ తో పాటు పలువురు హాజరయ్యారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని ఎన్డీఏ నాయకులు సత్కరించారు.