ఉపాధి హామీ కూలీలకు అవసరమైన వసతులు కల్పించాలి
08-05-2026 12:00 AM
రాజాపూర్ మే 7 : ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ఎండాకాలం ఎలాం టి ఇబ్బందులు రాకుండా వారికి అవసరమైన వసతులు కల్పించాలని డిఆర్డిఓ నర సింహ అన్నారు. గురువారం ఎంపీడీవో వి జయలక్ష్మితో కలిసి రాజపూర్ మండలంలో ని కల్లెపల్లి, పాలుగుగుట్ట తాండ గ్రామ పం చాయతీలను సందర్శించి, పూడికతీత పను ల ప్రదేశాన్ని తనిఖీ చేశారు. అక్కడ అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. చేసిన పనికి డబ్బులు సరిగా చెల్లిస్తు న్నారని ఆరా తీశారు.వారు పని ప్రదేశం లో తాగునీరు,టెంట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం ఎం పి ఓ వెంకట రా ములు ఏపీవో భారతి ఫీల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.






