8 May, 2026 | 1:04 AM

వైన్స్ యజమానుల సిండికేట్.. వినియోగదారుల ఆగ్రహం

08-05-2026 12:00 AM
  1. బెల్ట్ షాపులకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మణికంఠ వైన్స్‌కు తాళం
  2. పోలీసుల జోక్యంతో తెరుచుకున్న వైన్స్

చారకొండ, మే 7: మండల కేంద్రంలోని వైన్స్ యజమానుల తీరుపై స్థానిక వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధ నల ప్రకారం రెండు వైన్స్లలో మద్యం విక్రయాలు జరగాల్సి ఉండగా, యజమానులు సిండికేట్గా మారి సామాన్య వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపి స్తూ గురువారం మణికంఠ వైన్స్కు తాళం వేశారు. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో రెండు వైన్స్లు ఉన్నప్పటికీ, యజమానులు ఒప్పందం కుదుర్చుకుని ఒక వై న్స్లో మాత్రమే రిటైల్ విక్రయాలు సాగిస్తున్నారు. రెండో వైన్స్ను పూర్తిగా బెల్ట్ షాపు లకు మద్యం సరఫరా చేసేందుకే కేటాయించారు. దీనివల్ల వేసవి కాలంలో కూల్ బీర్ల కొరత ఏర్పడుతోందని, ఒక్క షాపులోనే విక్రయాలు జరపడంతో బీర్లు దొరకక అధిక ధ ర వెచ్చించి బెల్టు దుకాణాలలో కొనుగోలు చేయాల్సి వస్తుందని వినియోగదారులు మండిపడుతున్నారు.

వివాడానికి దారితీసిన దురుసుతనం.!

రెండో వైన్స్లో బీర్లు ఎందుకు అమ్మడం లేదని స్థానికులు సిబ్బందిని ప్రశ్నించగా, వారు యజమానితో మాట్లాడాలని సూచించారు. ఫోన్ ద్వారా యజమానితో మాట్లాడితే ఆయన వినియోగదారులపై దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన స్థానికులు షాపు ముందు బైఠాయించి, వైన్స్కు తాళం వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని, సమస్య ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించి సిబ్బందితో వైన్స్ తాళాలు తీశారు. అనంతరం వైన్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్, పోలీసు అధికారులు స్పందించి ఈ సిండికేట్ దందాను అరికట్టాలని కోరారు.