6 June, 2026 | 10:13 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

పురపాలికల ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి

01-01-2026 12:00 AM

కలెక్టర్ బి. ఎం. సంతోష్

గద్వాల, డిసెంబర్ 31 (విజయక్రాంతి): పురపాలికల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికలు, పురపాలికల్లో అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై  జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా పురపాలికల్లో ఉన్న వార్డుల వారీగా ఓటర్ల ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసేందుకు అవసరమైన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు, మూడు వార్డులకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించాలన్నారు.

ఒక్కో వార్డులో 850కు పైగా ఓటర్లు ఉంటే రెండు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా పురపాలికల్లో ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బంది స్థానికులు కాకుండా ఇతర మండలాల వారిని నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. గద్వాల, ఐజ, వడ్డేపల్లి, అలంపూర్ పురపాలికల్లో వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడంతో ఎన్నికల కోడ్ వచ్చేలోగానే టెండర్ పూర్తయి పనులు ప్రారంభించేలా మొత్తం ప్రక్రియను సంబంధిత ఇంజనీర్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

సీసీ రహదారులు, మురుగు కాలువలు, పార్కులు, జంక్షన్ల అభివృద్ధి, తదితర పనులు చేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో స్థలం సమస్య లేకుండా సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ఆయా అభివృద్ధి పనులకు టెక్నికల్ శాంక్షన్ పూర్తి చేసుకుంటే మిగిలిన ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. అన్ని పురపాలికల్లో జనవరి 20వ తేదీలోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభం కావాలని, అలసత్వం వహించే ఇంజనీర్లపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, జెడ్పి డిప్యూటీ సీఈవో నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్లు జానకి రామ్ సాగర్, శంకర్ నాయక్, సైదులు, రాజయ్య, డిఈ క్రాంతి, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.