calender_icon.png 1 January, 2026 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొల్లపల్లి స్టేజీ వద్ద రైతుల నిరసన

01-01-2026 12:00:00 AM

ఎవరి స్వార్థం కోసం మరో రిజర్వాయర్..

గొల్లపల్లి రిజర్వాయర్‌తో  1200 ఎకరాల భూములు కోల్పోతున్న రైతులు 

ముంపునకు గురవుతున్న మూడు గ్రామాలు 

కెనాల్ ద్వారా 100 ఎకరాల భూములే నష్టం 

గోపాలపేట, డిసెంబర్ 31: పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ ప్రాజెక్టు బండపై గొల్లపల్లి చీర్కపల్లి గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా గొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని మూడు గ్రామాల రైతులు నిరసనలు చేపడుతున్న సంఘటన వనపర్తి జిల్లా ఏదుల మండలం లోని పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ ప్రాజెక్టు వద్ద  నిరసన సెగలు రేగెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హాయంలోనే పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి 75 వేల ఎకరాలకు సాగునీరు అందించింది. కొల్లాపూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించాలన్న సంకల్పంతో వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అసెంబ్లీలో గొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తి చేస్తే కొల్లాపూర్ నియోజక వర్గానికి సాగునీరు అందించవచ్చని వాటికోసం నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో పెట్టారు.

కానీ ఈ నిధులన్నీ ఎవరి స్వార్థం కోసం గొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని గొల్లపల్లి చీరుకపల్లి, కేశంపేట తండాలో, గొల్లపల్లి శివారులో ఉన్న తండాలు రైతులు ఆరోపిస్తున్నారు. 100% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయని అయ్యాయని ఆ రైతులు తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు ద్వారా ఈ మూడు గ్రామాల్లో ఉన్న భూములు సుమారుగా 1200 ఎకరాలు భూములు రైతులు నష్టపోతారని అన్నారు.

కొల్లాపూర్ నియోజకవర్గానికి వనపర్తి నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం మరో దృష్టి పెడితే రైతులు నష్టపోకుండా ఉంటారని వారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గొల్లపల్లి కి కూత వేటు దూరంలోనే ఉంది. కాబట్టి 100% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయిందని 10% పనులతో గొల్లపల్లి,  చీరకపల్లి శివారు నుంచి( OT) తూము ద్వారా. ఐదు కిలోమీటర్లు కెనాల్ లక్ష్మీదేవి పల్లి వరకు పనులు చేపడితే కె ఎల్ ఐ ౄ8 కాలువ కె ఎల్ ఐ మేజర్ కాల్వ కూడా కలుస్తుంది దీనిద్వారా కొల్లాపూర్ నియోజక వర్గంలోని కోడేరు మండలాలు పానగల్ మండలాలు వీపనగండ్ల మండలాల్లోని గ్రామాల కు సాగునీరు అందించవచ్చని ఆ రైతులు వాపోతున్నారు.

ఈ కెనాల్ ఐదు కిలోమీటర్లు తొవ్వడం పట్ల రైతుల భూములు 100 ఎకరాల్లో మాత్రమే నష్టపోతారని గొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే మూడు గ్రామాల రైతులను ముంచడమే కాకుండా 1200 ఎకరాల భూములు నష్టపోతారని ఆవేదన చెందారు. గొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో కాంట్రాక్టర్లు లబ్ది పొందడం కోసం ఈ ప్రాజెక్టు ముందుకు వేసుకున్నారని ఎద్దేవా చేశారు వెంటనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ గొల్లపల్లి ప్రాజెక్టు నిర్మాణం వెంటనే విరమించుకోని. తూము నుండి కెనాల్ పనులు ప్రారంభించి కోడేరు పానగల్ వీపనగండ్ల మండలాల గ్రామాలకు సులభంగా సాగునీరు తీసుకెళ్లవచ్చని అన్నారు. గొల్లపల్లి ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపడుతామంటే ఊరుకునేది లేదని రైతులంతా పాలమూరు ప్రాజెక్టు బండపై పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని సవాల్ చేశారు. గొల్లపల్లి చీరకపల్లి కేశంపేట తండా చెన్నారం శివారులోని తండా రైతులు పాల్గొన్నారు.