8 April, 2026 | 10:28 AM

కాంగ్రెస్‌లో చేరిన తాటిపాముల సర్పంచ్, వార్డు సభ్యులు

01-01-2026 12:00 AM

సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే

వనపర్తి, డిసెంబర్ 31 (విజయక్రాంతి) : శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామ సర్పంచ్ శిరీష మద్దిలేటి , వార్డు సభ్యులు రేణుక సురేష్, ఆంజనేయులు, అలివేలమ్మ లతో 80 మంది బి ఆర్ ఎస్ నాయకులు, మండలాధ్యక్షులు రాములు యాదవ్ ఆధ్వర్యంలో వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉంటుందని స్వేచ్ఛగా ఉండవచ్చునని ఎమ్మెల్యే వారికి సూచించారు. 

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తను సర్పంచ్ గా గెలుపొందానని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై, గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, నేడు పలువురు వార్డు సభ్యులతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు శిరీష మదిలేటి పేర్కొన్నారు. గడిచిన 10 సంవత్సరాల బి ఆర్ ఎస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్వీర్యమైపో యాయని , నేడు ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దిలేటి, ఎన్ ఎస్ యు ఐ బాలరాజు, ఎల్ల స్వామి, కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నారు.