calender_icon.png 17 February, 2026 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నీరజ

17-02-2026 12:00:00 AM

తాండూరు, ఫిబ్రవరి16 (విజయకాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా పట్లోళ్ల నీరజ  (కాంగ్రెస్), వైస్ చైర్‌పర్సన్‌గా అబ్దుల్ రజాక్ (కాంగ్రెస్) సోమవారం జరిగిన ప్రత్యేక మున్సిపల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పట్లోళ్ల నీరజ 12 వ వార్డ్ సభ్యురాలుగా, అబ్దుల్ రజాక్ 29వ వార్డు సభ్యులుగా  ఎన్నికయ్యారు. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లకు ఎన్నికల ప్రత్యేక అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి మంగీలాల్  ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎక్స్ అఫీషియొ నెంబర్ & ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.