calender_icon.png 16 July, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి నీట్ కౌన్సెలింగ్

16-07-2025 12:16:59 AM

  1. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్
  2. విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ
  3. ఇవాళ్టి నుంచే కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ 
  4. ఈ నెల 21 నుంచి ఆల్ ఇండియా కోటాకు.. 

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్  కోటా కౌన్సెలింగ్ ప్రక్రియకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌లో పాల్గొనదలచిన విద్యార్థులు ఈ నెల 16వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఈ నెల 25 వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వర్సిటీ వెబ్‌సైట్ <https://tsmedadm. tsche. in?> లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

రిజిస్ట్రేషన్ స మయంలో కులం, స్థానికతలకు సం బంధించిన సర్టిఫికెట్లను తప్పనిసరిగా అప్‌లోడ్ చే యాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం రాష్ట్రానికి చెందిన (స్థానిక కోటా) విద్యార్థుల జాబితాను విడుదల చేసి వెబ్‌సైట్‌లో ఆప్షన్స్ ఇచ్చుకునే ప్రక్రియను ప్రారం భిస్తారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 85 శాతం సీట్లను, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భ ర్తీ చేస్తారు. రాష్ట్రం నుంచి నీట్ యూజీ ప్రవేశపరీక్షను 70,259 మంది  రాయగా.. 43, 400 మంది కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. కాగా దేశంలోని అన్ని ప్రభుత్వ మెడి కల్ కాలేజీల్లోని సీట్లలో 15 శాతం ఆల్ ఇం డియా కన్వీనర్ కోటాలోకి వెళ్తాయి. 

21 నుంచి ఆల్ ఇండియా కోటా సీట్లకు

ఆల్ ఇండియా కోటా సీట్లకు ఈ నెల 21 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్, ఆప్షన్స్ ఎంపిక చేసు కోవాలని, సీటు అలాట్‌మెంట్ అయ్యాక ఫిజికల్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంద ని ఎం సీసీ వెల్లడించింది. ఈ నెల 21న రిజిస్ట్రేషన్లతో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమై అక్టోబర్ 3తో ముగుస్తుంది. రాష్ట్రంలో 34 ప్రభు త్వ వైద్య కళాశాలల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటులో 4,600 సీట్లున్నాయి.