calender_icon.png 15 July, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు జిల్లాల్లో హెచ్‌సీఏ క్లబ్‌లపై టీసీఏ ఫిర్యాదు

15-07-2025 01:25:08 AM

  1. త్వరలోనే మిగిలిన క్లబ్‌లపై కూడా నమోదు చేస్తాం
  2. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి
  3. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు సహా ఆరుగురి కస్టడీకి సీఐడీ పిటిషన్

హైదరాబాద్, సిటీబ్యూరో జూలై 14 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా బోర్డు సభ్యులను సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే మరోసారి హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగంపై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో 20 ఏళ్లుగా జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని హెచ్‌సీఏ క్లబ్‌లపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) ఆయా జిల్లాల పోలీస్ ఉన్న తాధికారులకు క్రిమినల్ ఫిర్యాదులు చేసిం ది. అయితే ఏటా జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి వార్షిక ఖర్చు కింద రూ.20 లక్షలను హెచ్‌సీఏ కేటాయిస్తుంది. గత 20 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

కానీ కేటాయించిన నిధులు జిల్లాల్లో ఉపయోగించడం లేద ని తాజాగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ నిర్వహించిన ఫోర్సెన్సిక్ ఆడిట్‌లో బయట పడింది. దీంతోపాటు ఈ నివేదిక వెల్లడించిన విషయాలను హైకోర్టు నియమించిన కమిటీ, క్రికెట్ సంస్కరణలను పర్యవేక్షించే సుప్రీంకోర్టు నియమించిన కమిటీలు కూడా ధృవీక రించాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి బా ధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ కమిటీలు సిఫార్సు చేశాయి.

కానీ హెచ్‌సీఏలో ఎన్నికైన ఏ బోర్డు ఈ సిఫార్సులను క్రమపద్ధతిలో అమలు చేయలేదని టీసీఏ ఆరోపించింది. హెచ్‌సీఏ నిర్లక్ష్య ధోరణి, ఉద్దేశపూర్వకంగానే నిధుల దుర్వినియోగం జరి గినందున ఈ నాలుగు జిల్లాల పేరుతో హె చ్‌సీఏ క్లబ్‌లపై ఫిర్యాదులను సమర్పించిన ట్టు గురువారెడ్డి వివరించారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోని హెచ్‌సీఏ సంబంధిత క్లబ్‌లపై ఈ రకమైన ఫిర్యాదులు నమోదు చేయనున్నట్టు హెచ్చరించారు.

రాష్ట్రంలో గ్రామీణ, వెనుకబడిన క్రికెటర్లను శిక్షణ ఇచ్చేందుకు కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసిన వారందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీసీఏ డిమాండ్ చేసింది. అయితే టీసీఏ ఆరోపణలు, ఫిర్యాదులతో తెలంగాణలో క్రికెట్ శిక్షణ, ఎంపిక ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. 

హెసీఏ కుంభకోణం.. కస్టడీకి కోరిన సీఐడీ

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో చోటుచేసుకున్న అవకతవకల కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్‌కు తరలించిన హెసీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు సహా మరో ఐదుగురిని కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మల్కాజిగిరి కోర్టు విచారణ చేపట్ట నుంది.

నిందితులను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు తమ పిటిషన్‌లో కోరారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న దేవరాజ్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని సీఐడీ అధికారులు తెలిపారు.