calender_icon.png 13 July, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంటోళ్ల నిర్లక్ష్యం.. రైతన్నకు శాపం?

27-06-2025 12:29:27 AM

  1. గాలి దుమారానికి నేలకొరిగిన స్తంభాలు
  2. తీగలు తెగి పడినా పట్టించుకోని అధికారులు 
  3. 40 రోజులైన పట్టింపులేని వైనం

కామారెడ్డి, జూన్ 26, (విజయ క్రాంతి), విద్యుత్ సమస్య తలెత్తితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు ఆచరణలో మాత్రం పాటించడం లేదు. విద్యుత్ స్తంభాలు గాలి, దుమారాలకు నేలకొరిగి ప్రమాదానికి దగ్గరలో ఉన్న స్థానికంగా ఉన్న విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేసేందుకు స్పందించడం లేదు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ డివిజన్ల పరిధిలో ఇదే పరిస్థితి తో రైతులు గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు.

విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోతున్నారు, మరోవైపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నివాసపు గుడిసెలు దగ్ధమవుతున్నాయి. 24 గంటల పాటు విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉండి సేవలందిస్తు న్నామని విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు చెప్తున్నా ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఫోన్ చేసి సమాచారం అందించిన అందరూ విద్యుత్ శాఖ అధికారులు స్పందించడం లేదు.

ఇందుకు నిదర్శనం విద్యుత్ అధికారులు ఆలసత్వం వల్ల విద్యుత్ స్తంభం ధ్వంసమై మరమ్మతులు చేపట్టాలని ఓ రైతు అధికారులను వేడుకున్న 40 రోజులు కావస్తున్నా మరమ్మత్తులు మాత్రం చేయలేదు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి విద్యుత్ డివిజన్ పరిధిలోని మాచాపూర్ గ్రామానికి చెందిన బెస్త సాయిలు తన కౌలు భూములు విద్యుత్ స్తంభం గాలి దుమారానికి నేలకొరిగి విద్యుత్ స్తంభం వంశం కాగా దానికి సంబంధించిన విద్యుత్ వైర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ అధికారులకు రైతు సాయిలు విన్నవించిన పట్టించుకోవడం లేదు.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయిల్ కు సంబంధించిన విద్యుత్ స్తంభం ద్వంసం కాగా వరి పొలంలో పడి 40 రోజులుగా స్తంభం విరిగిపోయి పడి ఉన్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితి కేవలం సాయిలు పరిస్థితి మాత్రమే కాదు. మాచాపూర్ పరిధిలో రైతుల పరిస్థితి దారుణంగా మారుతోంది.

మాచాపూర్ పరిధి లోగల బెస్త సాయిలు అనే రైతు కౌలుకు తీసుకున్న పొలంలో విద్యుత్ స్తంభం  విరిగిపడి నెలరోజులు అవుతున్న విద్యుత్ స్తంభాన్ని ఇప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతు చేయలేదు.విద్యుత్ శాఖ అధికారుల తీరుపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 40 రోజుల క్రితం కురిసిన గాలి, దుమారం లేచి వానలో విద్యుత్ స్తంభం విరిగిపడి  తీగలన్నీ పొలంమధ్యలో పడి ఉన్నాయి. రైతులు వారం వారం అధికారులను ఫోన్ చేస్తూ విజ్ఞప్తులు చేసినా సరే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సరైన స్పందన ఇవ్వడం లేదన్నారు.

అచ్చయ్యపల్లి నివాసి రైతు బెస్త సాయిలు చెబుతూ కన్నీటితో తన ఆవేదనను వ్యక్తం చేశారు. వరి పంటకు నారుమడి, విత్తనాలు వేసే సమయమైపోయింది. విద్యుత్ లేక బోర్ నీళ్లు లేవు... పంట సాగు అసాధ్యమైంది. తుకం కూడా వేయలేని దుస్థితి వచ్చింది, విద్యుత్ అధికారులకు చెప్పినా, స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందిని పంపించి చూస్తాం పంపిస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప మరమ్మతులు మాత్రం చేయడం లేదు. విద్యుత్ శాఖ అధికారుల అజాగ్రత్త తీరుతో ఒక్క రైతు సాయిలు మాత్రమే కాకుండా గ్రామంలోని ఇతర రైతులు కూడా భవిష్యత్ పంటలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలంలో విచ్చలవిడిగా పడి ఉన్న విద్యుత్ తీగలు ఎప్పుడైనా ప్రమాదానికి దారి తీయవచ్చనే భయంతో గ్రామస్తులు రాత్రిళ్లు భయంతో గడుపుతున్నారు.

ఈ ఘటనపై గ్రామ ప్రజలు కలవర పడుతున్నారు, విద్యుత్ శాఖ అధికారులు తక్షణం స్పందించి విరిగిన విద్యుత్ స్తంభాలను మార్చి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి గ్రామాలలో ఇలాంటి సమస్య లు ఉంటే తక్షణమే పరిష్కరించాలని రైతులు విద్యుత్ శాఖ అధికారుల ను కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు సమస్యలను పట్టించుకోకుంటే, సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని జిల్లాలోని రైతులు హెచ్చరిస్తున్నారు.

ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్న వెంటనే మరమ్మతులు చేపట్టడం లేదని రైతులు తెలిపారు. కామారెడ్డి మండల పరిధిలోని అడ్లూరు శివారులో ఎస్ ఎస్ 60 నెంబర్ గల ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మరమ్మత్తుల కోసం కామారెడ్డి మరమ్మతుల కేంద్రానికి తీసుకు వస్తే 20 రోజులైనా మరమ్మతులు చేయకుండా పట్టించుకోలేదు. జిల్లా విద్యుత్ శాఖ అధికారి దృష్టికి తెస్తేనే మరమ్మతులు చేసి మరొకటి ఇచ్చారని రైతులు తెలిపారు.

అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటాం 

రైతులు, ప్రజలు విద్యుత్ సమస్యపై ఇబ్బందులు పడితే స్థానిక అధికారులు స్పందిస్తారు. స్పందించకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ విద్యు త్ సరఫరాలో ఎలాంటి అటంకాలు కలగకుండా చూస్తున్నాం. ఈదురు గాలులు వీచి స్తంభాలు నేలకొరిగిన వాటి సమాచారం వస్తే వెంటనే తమ సిబ్బంది వెళ్లి మరమ్మతులు చేపడుతున్నారు. ఎక్కడైనా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే ఫిర్యాదు చేయాలి.

 శ్రావణ్ కుమార్, ఎస్ ఈ, కామారెడ్డి