calender_icon.png 13 July, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పిపోయిన బాలికను బంధువులకు అప్పగించిన ఆర్టీసీ ఉద్యోగులు

13-07-2025 02:55:52 PM

జడ్చర్ల: ఊరు మర్చిపోయి తప్పిపోయిన ఓ 13 ఏళ్ల బాలికను ఆర్టీసీ ఉద్యోగులు వారి కుటుంబసభ్యులకు అప్పగించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఆర్టీసీ బస్ స్టాండ్ లో చోటుచేసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేయడమే కాదు.. తప్పిపోయిన బాధితులను కూడా వారి కుటుంబాలతో కలపడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జడ్చర్ల ఆర్టీసీ కానిస్టేబుల్ ముడావత్ రాకేష్(Jadcharla RTC Constable Mudavath Rakesh) తెలిపిన సమాచారం ప్రకారం... 13 ఏళ్ల పాప గద్వాల్ బస్ ఎక్కి జడ్చర్ల బస్ స్టాండ్ కు వచ్చి తాము నివాసం ఉంటున్న ఊరు మర్చిపోయి బిజినపల్లికి వెళ్లింది.

అక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలో తెలియని బాలికను గుర్తించిన ఓ మహిళ తీసుకొచ్చి తనకు అప్పగించడం జరిగిందని రాకేష్ తెలిపారు. బాలిక పేరు చిన్నారి వాళ్ల ఊరు ఆల్వాన్ పల్లి దగ్గరల్లోని కుర్వగడ్డ పల్లి. తమ కుటుంబ సభ్యుల గురించి విచారించగా వాళ్ల తల్లిదండ్రుల పేర్లు, దోమల వెంకటయ్య, దోమల ఎల్లమ్మ వాళ్లు చనిపోయినట్లు బాలిక చెప్పింది. బాలిక పూర్తి సమాచారం తెలుసుకున్న కానిస్టేబుల్ రాకేష్, కంట్రోలర్ ఖలిల్, మరో కంట్రోలర్ వెంకటేష్(వనపర్తి డిపో) బాలికకు బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో వాళ్ల అక్క, అన్న జడ్చర్ల బస్ స్టాండ్ కు వచ్చారని, పూర్తిగా విచారించి బాలికను వారికి అప్పగించినట్లు రాకేష్ పేర్కొన్నారు. చిన్నారిని అమకు అప్పగించినందుకు వారు ఆర్టీసీ ఉద్యోగులకు కృతజ్జతలు తెలిపారు.