13-07-2025 03:01:23 PM
ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతోనే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం పట్టణంలో 30 పడకల ఆసుపత్రి, పాఠశాల, కళాశాలల ప్రారంభోత్సవానికి హాజరై విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుంది.
మరోవైపు అందరికి నాణ్యమైన వైద్యం అందించేలా అధునాతన టెక్నాలజీతో కూడిన ఆసుపత్రుల నిర్మాణం, క్వాలీఫైడ్ వైద్యులతో కార్పొరేట్ ఆసుపత్రులలో అందించే వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు ఉచితంగా అందించేందుకు కృషి చేస్తుందన్నారు. అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.