calender_icon.png 13 July, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దైవ అనుగ్రహంతోనే అభివృద్ధి సాధ్యం

13-07-2025 02:40:54 PM

తోట మైసమ్మ ఆశ్శీస్సులు అందరిపై ఉండాలి

ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): దైవ అనుగ్రహం తోని అభివృద్ధి సాధ్యమవుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  ఆషాఢ మాసం బోనాలు సందర్భంగా  పట్టణంలోని కురిహిని శెట్టి కాలనీ లో జరిగిన ఆషాఢ మాసం బోనాలు ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు  చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కి ఘనంగా స్వాగతం పలికారు. 

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో ఉత్సాహంగా మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవారికి తమ మొక్కులు తీర్చుకుంటారని తోట మైసమ్మ తల్లి వారి మొక్కులు స్వీకరించి ఆశీస్సులు ఇవ్వాలని కోరారు. దైవ అనుగ్రహం అంతరిపై ఉన్నప్పుడే మనం సంకల్పించిన ప్రతి పని అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తెలిపారు. దైవ అనుగ్రహం ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడిపిస్తుందని పేర్కొన్నారు.