13-07-2025 02:50:38 PM
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): వైద్య రంగానికి బ్రాండ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మారనుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. ఆదివారం పట్టణంలో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేం సాగర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యానికి పెద్దపీఠ వేస్తుందని, ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఎస్ఆర్ ప్రత్యేక కృషితో లక్షెట్టిపేటలో పీహెచ్సీని 30 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసి నూతన భవనాన్ని ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు.
ఇందులో గైనిక్, ఎన్సీడీ తదితర సేవలన్ని అందుబాటులో ఉంటాయని, ఇందుకు అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బందిని సమకూర్చామన్నారు. వైద్యానికి బ్రాండ్ గా ప్రభుత్వం మారుతుందన్నారు. అభివృద్ది అనేది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ హరీష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.