1 April, 2026 | 2:53 AM

గోవుల సంరక్షణపై నిర్లక్ష్యం తగదు

01-04-2026 01:20 AM

వేములవాడ ఈవో రమాదేవి 

గోశాలపై ప్రత్యేక దృష్టి

వేములవాడ, మార్చి 31 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో రమాదేవి.. జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బండ్రీ అధికారి రవీందర్‌రెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గోవుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ నెట్లు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లను పరిశీలించారు.

గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్ వంటి పోషకాహారం సమృద్ధిగా అందుతున్నదా అనే అంశాన్ని స్వయంగా తనిఖీ చేశారు. గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని ప్రశ్నిం చి, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముం దస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడిన ఈఓ రమాదేవి, గోవుల సంరక్షణలో మరింత శ్రద్ధ అవసరమని సూచిం చారు. ఈ తనిఖీలలో పర్యవేక్షకులు విజయ్ కుమా ర్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.