19 August, 2026 | 3:09 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ వర్ధంతి

19-08-2026 12:55 AM

గాంధారి, ఆగస్టు 18 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర పోరాటంలో నేతాజీ కీలక పాత్ర పోషించారని మన దేశానికి తొలిసారి ఆజాద్ హింద్ పౌజ్ అనే పేరుతో సైన్యాన్ని ఏర్పాటు చేసారని అన్నారు. నేతాజీ త్యాగమే ఈ రోజు మనం స్వేచా వాయువులు పీల్చుకోవడానికి కారణం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, సెక్రటరీ రవి, సామల రాజు, రాకేష్, యూత్ అధ్యక్షులు నితిన్, పట్టణ కార్యదర్శి మోతిలాల్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రాకేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.