19 August, 2026 | 3:09 AM

ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి

19-08-2026 12:55 AM

మండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్ మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): ప్రజా ప్రతినిధుల ప్రవర్తనలో పారదర్శ కత, జవాబుదారీతనం, న్యాయం, సమాన త్వం వంటి విలువలను మరింత బలోపేతం చేయడమే ఎథిక్స్ కమిటీ ప్రధాన లక్ష్యమని శాసన మండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశా రు. శాసన మండలి సభ్యులు, అధికారులు, సిబ్బందికి నైతిక విలువలపై అవగాహన కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేం దుకు కమిటీ కృషి చేస్తుందన్నారు.

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్ష తన మంగళవారం కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్ లో మండలి ఎథిక్స్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమి టీ ఛైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడు తూ  రాజకీయాల్లో సద్విమర్శ అవసరమే కానీ విమర్శలు హద్దులుదాటకూడదన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కమిటీ  కార్యాచరణతో ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే  ప్రధాన ధ్యే యంగా ఉండాలని పేర్కొన్నారు.