నగరంలో కొత్త అబ్కారీ పోలీస్ స్టేషన్లు
నాలుగు నెలల్లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (విజయక్రాంతి) : జీహెచ్‌ఎంసీ పరిధిలో 12 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లతో పాటు మరో రెం డు (సికింద్రాబాద్, ముషీరాబాద్) స్టేషన్లను విభజన చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చడంతో వాటి సంఖ్య 16కు చేరనుంది. సంవత్సర కాలంగా ఈ స్టేషన్ల ఏర్పాటు ముందుకు పడకపోవడంతో మిగతా స్టేషన్లలో పనిచేసే ఎక్సైజ్ సిబ్బంది, అధికారు లపై కేసుల ఒత్తిడి పెరుగుతున్నదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో పాటు డ్రగ్స్, గంజాయి, గుడుంబా, అక్రమ మద్యం సరఫరాపై ఎక్సైజ్ శాఖ సిబ్బంది చేతులు ఎత్తేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు సైతం గుర్తించారు. ముఖ్యంగా ఈ కొత్త స్టేషన్లు ఏర్పాటైతే అక్రమ మద్యం, గంజా యి, గుడుంబాలపై ఉక్కుపాదం మోపవచ్చని అబ్కారీ శాఖ అధికారులు పేర్కొ న్నారు. గ్రేటర్ పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే పోలీస్ స్టేషన్లలో శంషాబాద్, సరూర్‌నగర్, హయత్ నగర్, ఉప్పల్, ఘట్కేసర్, మల్కాజిగిరి, అమీర్‌పేట, నాంపల్లి, జూబ్లీహిల్స్, మలక్‌పేట, కుత్బుల్లాపూర్, లింగంపల్లి స్టేషన్లు ఉన్నాయి. దీంతో పాటు పఠాన్‌చెరులో ఎక్సైజ్ సర్కిల్ ఏర్పాటు చేయను న్నారు. అయితే వీటిని ఇప్పటికే ఏర్పాటు చేయాల్సి ఉండగా, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆలస్యం అయ్యిందని అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వం దృష్టికి అబ్కారీ సమస్య
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలోనూ పోస్టింగ్‌ల కోసం ఉన్నతాధికారులతో పాటు మంత్రులు, సీఎంపై కొందరు ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన విషయాన్ని ఎక్సైజ్ ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం వీటి ఏర్పాటుపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అబ్కారీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్టుగా సమాచారం. ముఖ్యంగా నగరంలో డ్రగ్స్, గంజాయి, గుడుంబా వంటి వాటికి చెక్ పెట్టాలంటే కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి సరిపడా సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. అబ్కారీ శాఖ నుంచి ప్రతి సంవత్సరం సుమారుగా రూ. 35వేల కోట్లపైగా ఆదా యం వస్తుండగా, రాష్ట్ర వ్యాప్తంగా 40 ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలతో పాటు 139 అబ్కారీ పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి.






