12 August, 2026 | 10:07 AM

గోల్డ్ స్కీం పేరుతో 4 కోట్లు టోకరా

25-05-2024 01:58 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (విజయక్రాంతి): అధిక వడ్డీ ఇస్తామని అబిడ్స్‌లో ఓ కంపెనీ రూ.200 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘటన మరవక ముందే..  శుక్రవారంరామంతాపూర్‌లో మరో మోసం బయటపడింది.   గోల్డ్ స్కీం పేరుతో రూ.4 కోట్ల వరకు వసూలు చేసి రాత్రికి రాత్రే జంప్ అయ్యారు. రూ.50 వేలు కట్టి స్కీంలో చేరితే, బంగారం కొనుగోలులో 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని విశాల్, వినయ్, నిఖిల్ అనే వ్యక్తులు అనేక మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. అలా సుమారు రూ.4 కోట్ల వరకు జమ చేసి పరారయ్యారు. ఈ క్రమంలో బంగారం గురించి పలువురు ఫోన్లు చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.  పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.