09-11-2025 01:58:56 AM
హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి) : ప్రపంచంలోనే వజ్రాలు, బంగారం, బాక్సుటై, మాంగనీస్, లిథియం తదితర ఉత్పత్తులకు ప్రముఖ దేశంగా పేర్కొనే రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశం సింగరేణి సంస్థను తమ దేశంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో శనివారం ఘనా దేశ ఉన్న త స్థాయి ప్రతినిధి బృందం సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.బలరామ్‌తో సమావేశమై పలు వ్యాపార అంశాలపై చర్చించారు.
తమ దేశం లో ఖనిజ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉందని, ఈ విషయంలో అపార అనుభవం గల సింగరేణి సంస్థకు తాము స్వాగతం ఘనా ప్రతినిధి బృందం తెలిపింది. తమ దేశంలో ప్రధానంగా వజ్రాలు, బంగారం, బాక్సుటై, మాంగనీస్ , లిథియం వంటి ప లు ఖనిజాల తవ్వకం, ఉత్పత్తులు పెద్ద ఎత్తున జరుగుతుంటాయని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుం టామన్నారు.
ఉత్పత్తి పెంచడానికి ఇందుకు అవసరమైన పెట్టుబడులను ఆహ్వానించడం కోసం వచ్చామని తెలిపారు. తమ దేశంలో బొగ్గు మైనింగ్ కూడా ఉందని, ఇందులోనూ సింగరేణి సహకారాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. సీఎండీ ఎన్.బలరామ్ స్పందిస్తూ సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా విదేశాల్లో ఇతర ఖని జాలు, కీలక ఖనిజ రంగాల్లో ప్రవేశించాలని ఇప్పటికే నిర్ణయించి ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. ఘనా దేశంలో మైనింగ్ చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తామన్నారు.