8 April, 2026 | 2:19 AM

పెబ్బేరు ప్రెస్ క్లబ్‌కు నూతన భవనం, స్లాబ్ పనుల ప్రారంభం

08-04-2026 12:00 AM

పెబ్బేరు ఏప్రిల్ 7: పట్టణంలోని ప్రెస్ క్లబ్ నూతన భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మంగళవారం  స్లాబ్ పనులను  ప్రారంభించారు. ఈ సందర్బంగా పలువురు  సీనియర్ విలేకర్లు మా ట్లాడుతూ..గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ వి ప్గా పనిచేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయులకు భవనం కేటాయించగా, దాదాపు 25 సంవత్సరాలుగా అదే భవనంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

అయితే, ఆ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త భవనం నిర్మాణం కోసం ప్రెస్ క్లబ్ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పం దించి గత పాలకవర్గం కేటాయించిన స్థలంలోనే నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించా రు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ స్లాబ్ పనులను ప్రారంభించి, భవనం త్వరితగతిన పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అ ధ్యక్షుడు బాలవర్ధన్, కౌన్సిలర్లు హరి శంకర్ నాయుడు, తాటికొండ కృష్ణ, శివ సాయి, మన్యం, కాంగ్రెస్ నాయకులు షకీల్, మా ర్కెట్ యార్డ్ డైరెక్టర్, కాంట్రాక్టర్ మోతే రాములు, అలాగే పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.