ప్రతి ఇంటికీ తాగునీరు సిద్ధం
08-04-2026 12:00 AM
భైంసా, ఏప్రిల్ (విజయక్రాంతి) : ముధోల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధ జలాన్ని అందించడం జరుగుతుందని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో తాగునీటి పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మా జీ ఎంపీపీలు గజ్జరం రమణారావు, సర్పంచ్ కే రవి గ్రామ నాయకులు పాల్గొన్నారు.




