శంకర్‌పల్లి - వికారాబాద్‌కు కొత్త బస్సు ప్రారంభం
శంకర్ పల్లి, మార్చి 19 (విజయక్రాంతి): శంకర్ పల్లి మరియు వికారాబాద్ ప్రాంతాల ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. శంకర్ పల్లి పట్టణం నుండి పర్వేద, గంగ్యాడ, పూలపల్లి గ్రామాల మీదుగా వికారాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే కొత్త బస్సు సర్వీసును చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామేనా భీమ్ భరత్ గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ భీమ్ భరత్ మాట్లాడుతూ అభివృద్ధి పథంలో పల్లెలు పయనిస్తున్నాయని, ప్రజా రవాణాకు పెద్దపీట వేస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్ గౌడ్, ఉప సర్పంచ్ సునీత వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు ఎండి. నసీరుద్దీన్, రామాలయ కమిటీ చైర్మన్ అనంతరెడ్డి, వార్డు సభ్యులు శ్రీనివాస్, విష్ణు కాంత్ రెడ్డి, అనిత ఆనంద్ గౌడ్, పద్మజ అనంతయ్య, సుభాన్ రెడ్డి, వెంకటేశం, రాములు, బుచ్చయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.




