20 March, 2026 | 8:44 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మల్లారెడ్డి కల్పన 50వ వివాహ వేడుకలు

20-03-2026 12:00 AM

మాది ఫేమస్ జంట : ఎమ్మెల్యే మల్లారెడ్డి 

సికింద్రాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): శ్రీ పరాభవ నామ సంవత్సర సందర్భంగా తెలుగు ప్రజలందరికి మల్లారెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. సరిగ్గా 50 ఏళ్ల కిందట ఇదే ఉగాది రోజున మంచి భార్య కల్పనతో  తాడుబండ్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో వివాహం జరిగిందని మల్లారెడ్డి అన్నారు.

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర కల్పన మల్లారెడ్డి  50వ వివాహ వార్షికోత్సవ (గోల్డెన్ జూబ్లీ) సందర్బంగా బోయిన్ పల్లి జయనగర్ లోని శ్రీ సాయి బాబా, తాడుబందు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో అభిమానులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వేడుకలలో పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించిమల్లారెడ్డి కల్పన దంపతులకు 50వ వార్షికోత్సవాన్ని శుభాకాం క్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా 50 కిలోల భారీ కేక్ కటింగ్, గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.